ఎల్ కాంగో విపత్తుతో తెలంగాణ నాశనమైంది

రిపోర్టర్: కృష్ణ స్థలం: Telangana

ఎల్ నినో విపత్తుతో వాతావరణం అల్లకల్లోలమైతే ఎల్ కాంగో వల్ల యావత్ తెలంగాణ రాష్ట్రమే నాశనమైందని బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇరవై రెండు ఏ పేరిట విచ్చలవిడి భూదందాలు జరుగుతున్నాయని, ప్రభుత్వ బిల్లులకు కమీషన్లు పెరిగాయని ఆరోపించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాడి తప్పిందని, ఇవన్నీ ఎల్ కాంగో తెచ్చిన విపత్తులేనంటూ ఆయన ఘాటు విమర్శలు గుప్పించారు.