భారీ వర్షాలు అల్పపీడన ప్రభావంతో ఏపీలో నీట మునిగిన పంటలు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: కాకినాడ

రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు వేలాది ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలు నీట మునిగాయని అధికారులు తెలిపారు. కాకినాడ, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాల్లో రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూశారు. లోతట్టు ప్రాంతాలు జలమయమై రాకపోకలు నిలిచిపోయాయి. ప్రభావిత ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు పర్యటించి రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నష్టపోయిన రైతన్నలను ప్రభుత్వమే ఆదుకోవాలని, తక్షణమే పరిహారం చెల్లించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.