వైద్య పరీక్షల్లో వెలుగులోకి గుజరాత్‌లో దారుణం అప్పు ఇచ్చిన వ్యక్తి చేతిలో మహిళపై అత్యాచారం

రిపోర్టర్: విజయ్ స్థలం: గుజరాత్

గుజరాత్‌లోని మోర్బీలో క్యాన్సర్ బాధితుడి భార్యకు ఎముక మజ్జ వైద్య పరీక్షల ద్వారా ఓ అత్యాచార ఉదంతం వెలుగులోకి వచ్చింది. భర్త చికిత్స కోసం భాజపా మహిళా కార్పొరేటర్ భర్త వద్ద అప్పు తీసుకున్న మహిళను, పరిస్థితిని ఆసరాగా చేసుకుని అతను పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. కుమారుడి డీఎన్‌ఏ పరీక్షల్లో తండ్రితో నమూనా సరిపోలకపోవడంతో అనుమానం వచ్చి బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా, పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.