చర్చలు ఫలించడంతో సెప్టెంబర్ 28 నుంచి జరగాల్సిన బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా

రిపోర్టర్: రాజేష్ స్థలం: Andhra Pradesh / Telangana

సెప్టెంబర్ 28 నుండి 30 వరకు జరగాల్సిన బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా పడినట్లు Telugu Scribe వెల్లడించారు. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ తో యునైటెడ్ ఫోరమ్స్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ UFBU ప్రతినిధులు ఆదివారం జరిపిన చర్చలు ఫలించడంతో యూనియన్లు సమ్మెను విరమించుకున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో శనివారాల సెలవు డిమాండ్ పై కూడా సానుకూలంగా చర్చలు జరిగాయని, త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని వివరించారు.