ఎన్నికల్లో మనవరాలు గెలుపు, ఎనిమిది సార్లు గెలిచిన తాత ఓటమి
రిపోర్టర్: కృష్ణ
స్థలం: రాజస్థాన్
రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లా జహాజ్‌పూర్ మున్సిపల్ ఎన్నికల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. 21 ఏళ్ల ఫిజియోథెరపీ విద్యార్థిని సానియా ఖానం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించి జిల్లాలోనే పిన్న వయసు కౌన్సిలర్‌గా నిలిచారు. అయితే, ఎనిమిది సార్లు విజయం సాధించిన ఆమె తాత నజీర్ మహమ్మద్ మాత్రం ఈ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. యువత విద్య, అభివృద్ధి కోసం పాటుపడతానని సానియా తెలిపారు.