హీరోయిన్ కాళ్లపై త్రివిక్రమ్ పడ్డారంటూ వైరల్ ప్రచారంపై స్పందించిన దర్శకుడు

రిపోర్టర్: విజయ్ స్థలం: హైదరాబాద్

హీరోయిన్ శ్రీనిధి శెట్టి కాళ్లపై తాను పడ్డానంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ స్పందించారు. ఆదర్శ కుటుంబం చిత్ర ప్రీ రిలీజ్ వేదికపై ఆమెను సరదాగా ఆటపట్టించడానికే అలా యాక్ట్ చేశానని, దాని వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని ఆయన తెలిపారు. ఈ మేరకు ఓ మీడియా సమావేశంలో త్రివిక్రమ్ మాట్లాడుతూ గత రెండు రోజులుగా నడుస్తున్న రూమర్లకు పూర్తిగా తెరదించారు.