బొబ్బిలిపేటలో వైసీపీ అభ్యర్థుల తరఫున హోరెత్తిన ఎన్నికల ప్రచార జోరు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఆమదాలవలస

ఆమదాలవలస మండలం బొబ్బిలిపేట గ్రామంలో గురువారం వైసీపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జడ్పీటీసీ అభ్యర్థి సనపల పద్మావతి, ఎంపీటీసీ అభ్యర్థి గురుగుబెల్లి ప్రభాకర్ రావు ఇంటింటా ప్రచారం చేశారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ ప్రచారంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.