రూ.11,359 కోట్ల పట్టణ అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన

రిపోర్టర్: శివ స్థలం: కుప్పం

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పట్టణాల రూపురేఖలను మార్చేలా కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక మౌలిక వసతుల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి వర్చువల్ విధానంలో 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో రూ.11,359 కోట్ల విలువైన పట్టణ అభివృద్ధి పనులకు మంగళవారం శంకుస్థాపన చేశారు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ విధానంలో ఈ పనులను చేపడుతున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా రహదారులు, వీధి దీపాలు, పార్కుల నిర్మాణం చేపట్టనున్నట్లు సీఎం వెల్లడించారు.