బా బా బ్లాక్ షీప్ చిత్రం నుంచి వేవేల ఊహలే సాంగ్ లాంచ్ చేసిన అనిల్ రావిపూడి
రిపోర్టర్: గోపి
స్థలం: హైదరాబాద్
యానిమల్ ఫేం ఉపేంద్ర లిమాయే ప్రధాన పాత్రలో గుణి మంచికంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రైమ్ కామెడీ చిత్రం బా బా బ్లాక్ షీప్. ఈ సినిమా నుంచి వేవేల ఊహలే అంటూ సాగే ప్రత్యేక పాటను ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి లాంచ్ చేశారు. చిత్రాలయం స్టూడియోస్ పతాకంపై వేణు దోణెపూడి నిర్మిస్తున్న ఈ చిత్రంలో టిను ఆనంద్, జార్జ్ మరియన్, అక్షయ్ లగుసాని, విష్ణు తదితరులు కీలక పాత్రలు పోషిస్తుండగా అక్టోబర్ 9న గ్రాండ్ రిలీజ్ కానుంది.