పింఛనుదారులకు తీపి కబురు: ఇంటి వద్దే డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సేవలు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: New Delhi
పింఛనుదారులు తమ ఇంటి వద్ద నుంచే డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ పొందవచ్చని Ministry of Labour & Employment, GoI వెల్లడించింది. దీనికోసం ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకును సంప్రదించాలని పేర్కొంది. ఈ సేవలను వినియోగించుకోవడానికి ప్రత్యేకంగా ఫోన్ కాల్ ద్వారా సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చని వివరించింది. ఈ మేరకు వృద్ధులు, పింఛనుదారుల సౌకర్యం కోసం ఈ నూతన సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు అధికారులు స్పష్టం చేశారు.