ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందుతాయని ఎమ్మెల్యే మట్టా రాగమయి స్పష్టీకరణ
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: సత్తుపల్లి
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రేజర్ల గ్రామ పంచాయతీ కార్యాలయంలో శనివారం పలువురు లబ్ధిదారులకు ఎమ్మెల్యే మట్టా రాగమయి స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంతో పోలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు. అభివృద్ధి పనులను ఎవరూ అడ్డుకోవద్దని సూచించారు.