పసిఫిక్ మహాసముద్రంలో వింత జీవుల ప్రయాణం వెలుగులోకి
రిపోర్టర్: సునీల్
స్థలం: Southeast Pacific Ocean
దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో శాస్త్రవేత్తలు ఓ అరుదైన సముద్ర దృశ్యాన్ని గుర్తించారు. చిలీ తీర ప్రాంతంలో 2024 నవంబర్ లో జరిపిన పరిశోధనల్లో, సముద్రపు సాలీళ్లపై చిన్నపాటి యాంఫిపాడ్ జీవులు అతుక్కుని ప్రయాణిస్తున్నట్లు తేలింది. బలహీనమైన ఈత సామర్థ్యం కలిగిన ఈ జీవులు, పెద్ద సముద్రపు సాలీళ్లను రవాణా సాధనంగా వాడుకుంటూ సుదూర ప్రాంతాలకు ప్రయాణిస్తున్నాయని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఫోరెసిస్ అని పిలువబడే ఈ వింత ప్రవర్తన సముద్ర జీవుల జీవన విధానంపై కొత్త విషయాలను వెల్లడిస్తోంది.