హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనం వేళ భారీ ట్రాఫిక్ ఆంక్షలు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్‌లో గణనాథుల నిమజ్జనోత్సవం సందర్భంగా శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి శనివారం ఉదయం 10 గంటల వరకు నగరంలో కఠిన ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు. హుస్సేన్ సాగర్‌తోపాటు వివిధ జలాశయాల వద్దకు తరలివచ్చే లక్షలాది విగ్రహాల శోభాయాత్ర కోసం సుమారు 30 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రధాన మార్గాల్లో వాహనాల మళ్లింపు ఉంటుందని వాహనదారులు సహకరించాలని కోరారు.