రోడ్డు ప్రమాద బాధితులకు తీపి కబురు: పీఎం రహత్ పథకంతో ఉచిత వైద్యం
రిపోర్టర్: హరి
స్థలం: తాడ్వాయి
రోడ్డు ప్రమాదాల్ లో క్షతగాత్రులకు గోల్డెన్ అవర్ లో తక్షణ వైద్యం అందించి ప్రాణాలు కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పీఎం రహత్ పథకాన్ని అమలు చేస్తోందని అధికారులు తెలిపారు. కామారెడ్డి జిల్లాలో ఈ పథకంపై జూమ్ మీటింగ్ ద్వారా మండల ఎస్సై లకు అవగాహన కల్పించారు. ఈ పథకం ద్వారా బాధితులకు ఏడు రోజుల పాటు లేదా లక్షా యాభై వేల రూపాయల వరకు ఎలాంటి ముందస్తు డిపాజిట్లు లేకుండా ఉచితంగా క్యాష్‌లెస్ వైద్యం అందుతుందని వెల్లడించారు.