దండేపల్లి ఆసుపత్రిని తనిఖీ చేసి సేవలపై కలెక్టర్ కుమార్ దీపక్ కీలక ఆదేశాలు
రిపోర్టర్: R.RAVINDER
స్థలం: మంచిర్యాల
దండేపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలోని వార్డులు, రిజిస్టర్లు, పడకలను పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్యను పెంచాలని, వైద్యులు సిబ్బంది సమయపాలన పాటిస్తూ గర్భిణులకు మెరుగైన సేవలు అందించి ప్రభుత్వ వైద్యంపై అవగాహన కల్పించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.