యాదగిరిగుట్టలో సొంత ఖర్చుతో నూతన నిర్మాణాలకు శ్రీకారం చుట్టిన సత్యనారాయణరెడ్డి

రిపోర్టర్: Alfa News Desk స్థలం: యాదగిరిగుట్ట

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ సన్నిధిలో నిర్మించనున్న కల్యాణ మండపంతోపాటు రాయగిరి సమీపంలో ఏర్పాటు చేయనున్న భారీ స్వాగత తోరణం నమూనాలను ఆలయాధికారులు గురువారం విడుదల చేశారు. వైటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ సత్యనారాయణరెడ్డి తన సొంత ఖర్చుతో ఈ నూతన నిర్మాణాలను చేపట్టనున్నారు. ఈరోజు వీటికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నారు.