భారత క్రికెట్ భవిష్యత్తుపై లాన్స్ క్లూసెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: న్యూఢిల్లీ
భారత క్రికెట్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తర్వాత వైభవ్ సూర్యవంశీ తదుపరి సూపర్‌స్టార్‌గా ఎదగగలడని దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ లాన్స్ క్లూసెనర్ పేర్కొన్నారు. అబుదాబి టీ10 లీగ్ సందర్భంగా ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, శుభ్‌మన్ గిల్ నాయకత్వ లక్షణాలపై కూడా పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. దిగ్గజ ఆటగాళ్ల రిటైర్మెంట్ సహజమని, కొత్త యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తే అద్భుతాలు సృష్టిస్తారని క్లూసెనర్ స్పష్టం చేశారు.