పుత్తూరులో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సీపీఐ ఇంటింటి ఎన్నికల ప్రచారం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: నగరి
తిరుపతి జిల్లా పుత్తూరు పట్టణంలోని పదిహేడవ వార్డులో సీపీఐ అభ్యర్థి ఏ రోజా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. స్థానిక ప్రజలను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కంకి కొడవలి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పి మురళి ప్రజలను కోరారు. మురుగునీటి సమస్యలు పరిష్కరిస్తామని, కౌన్సిల్లో ప్రజా సమస్యలపై గట్టిగా పోరాడుతామని ఆయన స్పష్టం చేశారు.