అమెరికాతో తక్షణ చర్చల ప్రసక్తే లేదని ఇరాన్ స్పష్టీకరణ

రిపోర్టర్: అశోక్ స్థలం: World

అమెరికాతో తక్షణమే దౌత్య చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ మొహ్సెన్ రెజాయీ స్పష్టం చేశారు. తమ ప్రాథమిక షరతులు నెరవేరే వరకు టెహ్రాన్ ఎలాంటి సంప్రదింపులకు తిరిగి రాదని ఆయన తేల్చిచెప్పారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో రెజాయీ ఈ ప్రకటన చేశారు. షరతులు నెరవేరే వరకు చర్చలు ఉండబోవని హెచ్చరించారు.