జహీరాబాద్, కోహీర్ మున్సిపాలిటీల్లో కో-ఆప్షన్ పదవుల భర్తీలో జాప్యం
రిపోర్టర్: హరి
స్థలం: సంగారెడ్డి
జహీరాబాద్, కోహీర్ మున్సిపాలిటీల్లో పాలకవర్గాలు ఏర్పడి 7 నెలలు గడిచినా కో-ఆప్షన్ పదవుల భర్తీ ప్రక్రియ నానుతోంది. జహీరాబాద్‌లో కేవలం ఒక్క ఓటు తేడా ఉండటంతో అధికార కాంగ్రెస్ ఆచితూచి అడుగులు వేస్తోంది. కోహీర్‌లో స్పష్టమైన మెజారిటీ ఉన్నా నియామకాలు జరగలేదు. దీంతో 58 మంది ఆశావహుల్లో తీవ్ర అయోమయం నెలకొనగా, వెంటనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.