'మహిళా సాధికారతకు 25 ఏళ్లు': ప్రధాని మోదీ సేవలు అమోఘం
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: అమరావతి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవలో మహిళల సంక్షేమం కోసం బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు విద్య, ఆరోగ్యం, భద్రత, ఆర్థిక స్వాతంత్ర్యం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారని బీజేపీ ఆంధ్రప్రదేశ్ కొనియాడింది. మహిళా సంక్షేమం నుంచి మహిళా నాయకత్వం దిశగా భారత్ పయనిస్తోందని, ఇదే మోదీ 25 ఏళ్ల సేవా సంకల్పానికి అసలైన నిదర్శనమని పార్టీ నాయకులు స్పష్టం చేశారు.