ఎల్బీనగర్ కారిడార్కు గ్రీన్ సిగ్నల్: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో కోమటిరెడ్డి భేటీ

రిపోర్టర్: విజయ్ స్థలం: Hyderabad

తెలంగాణలో మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా ఎల్బీనగర్ నుంచి హయత్నగర్ వరకు డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. దిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో ఆయన భేటీ అయ్యి నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, హైదరాబాద్ అమరావతి గ్రీన్ఫీల్డ్ హైవే ప్రాజెక్టులపై చర్చలు జరిపినట్లు వెల్లడించారు.