వైవిధ్యమైన కథాంశంతో సత్యదేవ్ సమవర్తి టీజర్ విడుదల

రిపోర్టర్: శివ స్థలం: హైదరాబాద్

ట్యాలెంటెడ్ హీరో సత్యదేవ్ ప్రధాన పాత్రలో అజయ్ నాగ్ వి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎకోలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ సమవర్తి సినిమా టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ప్రకృతికి, మానవులకు మధ్య నడిచే సంఘర్షణ, అడవుల అక్రమ నరికివేత నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో మహాదేవ్ అనే వైల్డ్ అండ్ రగ్డ్ పాత్రలో సత్యదేవ్ నటిస్తుండగా, దిలీష్ పోతన్, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.