ఏపీని స్పోర్ట్స్ హబ్ గా మార్చాలని జై షాను కోరిన లోకేష్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జాతీయ క్రీడా హబ్ గా తీర్చిదిద్దేందుకు సహకరించాలని ఐసీసీ ఛైర్మన్ జై షాను ఏపీ మంత్రి నారా లోకేష్ కోరారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జై షాతో భేటీ అయిన ఆయన, విశాఖపట్నాన్ని వాటర్ స్పోర్ట్స్ గమ్యస్థానంగా మార్చాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో అసెంబ్లీ ప్రీమియర్ లీగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలను మంత్రి లోకేష్ ఈ సందర్భంగా వివరించినట్లు అధికారులు తెలిపారు.