ఆంధ్రప్రదేశ్‌లో పెండింగ్ నంది అవార్డుల ప్రదానానికి ప్రభుత్వం ప్రకటన

రిపోర్టర్: విజయ్ స్థలం: ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న నంది అవార్డులను ప్రదానం చేస్తామని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌ ప్రకటించారు. ఏపీ ఎఫ్‌డీసీ ఛైర్మన్ భరత్ భూషణ్‌తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో 2012 నుంచి 2016 వరకు ఎంపిక చేసిన అవార్డులతో పాటు 2017 నుంచి 2024 వరకు సంవత్సరానికి 4 చొప్పున అవార్డులు అందజేస్తామని వెల్లడించారు. డిసెంబర్ 25 నాటికి ఎన్టీఆర్ అవార్డులను కూడా ప్రదానం చేయనున్నట్లు తెలిపారు.