స్పామ్ కాల్స్ కట్టడికి ఏఐ విధానంతో ట్రాయ్ కీలక నిర్ణయం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: న్యూఢిల్లీ
స్పామ్ కాల్స్‌ను అరికట్టేందుకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా సరికొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా మెషిన్ లెర్నింగ్ విధానం ద్వారా అనుమానాస్పద కాల్స్‌ను గుర్తిస్తే ఎలాంటి ఫిర్యాదు లేకపోయినా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తొలిసారి స్పామ్ కాల్స్‌కు పాల్పడితే సంబంధిత మొబైల్ కనెక్షన్లను పదిహేను రోజుల పాటు నిలిపివేస్తామని ట్రాయ్ స్పష్టం చేసింది.