ది ప్యారడైజ్ మూవీకి తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరల పెంపు అనుమతి
రిపోర్టర్: నరేష్
స్థలం: తెలంగాణ
నాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ది ప్యారడైజ్ సినిమా ప్రత్యేక షోలు మరియు టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా అనుమతులు మంజూరు చేసింది. సెప్టెంబర్ 23న సాయంత్రం 6.30కి రూ.500 ధరతో ప్రీమియర్ షోకు పర్మీషన్ ఇస్తూ, సినిమా విడుదల రోజు నుంచి తొలి ఐదు రోజులు మల్టీప్లెక్స్‌లలో రూ.94, సింగిల్ స్క్రీన్లలో రూ.48 చొప్పున అదనపు ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. అలాగే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్‌కు నిర్మాత రూ.1 కోటి విరాళం అందించాలని ఆదేశించింది.