యాపిల్ 20వ వార్షికోత్సవ ఐఫోన్ డిజైన్ లీక్

రిపోర్టర్: శివ స్థలం: World

ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ సంస్థ ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న 20వ వార్షికోత్సవ ఐఫోన్ 20 ప్రో సిరీస్‌కు సంబంధించిన డిజైన్ వివరాలు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. క్వాడ్ కర్వ్‌డ్ ప్యానెల్, పంచ్-హోల్ కటౌట్‌తో సరికొత్త డిస్‌ప్లే డిజైన్‌ను యాపిల్ పరీక్షిస్తున్నట్లు సమాచారం. డైమెన్సిల్ ఐలాండ్‌కు వీడ్కోలు పలికి ఈ కొత్త డిజైన్‌ను 2027 నాటికి మార్కెట్లోకి తీసుకురావాలని కంపెనీ యోచిస్తున్నట్లు ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ వెల్లడించారు.