'రష్యా చమురు కొంటే 100 శాతం సుంకాలు': అమెరికా పార్లమెంట్ ఆమోదం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: World
అమెరికాలో రష్యా, ఇరాన్ దేశాలపై ఆంక్షలు విధించే ఉద్దేశంతో ప్రతిపాదించిన కీలక బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. రష్యా నుంచి ముడి చమురు, సహజ వాయువు దిగుమతి చేసుకునే దేశాలపై వంద శాతం వరకు సుంకాలు విధించే అధికారాన్ని ఈ బిల్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు కల్పిస్తుంది. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా నుంచి భారీగా చమురు దిగుమతి చేసుకుంటున్న భారత్‌పై ఈ పరిణామం తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.