సీబీఎస్ఈ పరీక్షా రికార్డుల సవరణపై పాఠశాలలకు కీలక ఆదేశాలు

రిపోర్టర్: గోపి స్థలం: న్యూఢిల్లీ

సీబీఎస్ఈ విద్యార్థుల రికార్డులలో డెమోగ్రాఫిక్ వివరాల సవరణ ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి బోర్డు పాఠశాలలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఫలితాలు వెలువడిన తర్వాత పెద్ద సంఖ్యలో అభ్యర్థనలు వస్తున్నందున, తరగతుల రిజిస్ట్రేషన్ సమయంలోనే వివరాలు వంద శాతం ఖచ్చితత్వంతో ఉండేలా చూడాలని స్పష్టం చేసింది. అసంపూర్ణ దరఖాస్తులను తిరస్కరిస్తామని, పాఠశాలల ద్వారానే విద్యార్థులు దరఖాస్తులు పంపాలని బోర్డు హెచ్చరించింది.