ఆరోగ్యవంతమైన సమాజమే లక్ష్యంగా పోషణ మాహోత్సవ కార్యక్రమం ప్రారంభం
రిపోర్టర్: గోపి
స్థలం: పల్నాడు
పల్నాడు జిల్లాలో పోషణ మాహోత్సవ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ అధికారికంగా ప్రారంభించారు. తల్లులు, చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహార ప్రాముఖ్యతపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందుతున్న సేవలపై నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.