ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ భారీ ఊరట: దూరప్రాంత బస్సు టికెట్ల ధరల తగ్గింపు

రిపోర్టర్: గోపి స్థలం: హైదరాబాద్

ఆర్టీసీ బస్సుల్ లో ప్రయాణికుల సంఖ్యను పెంచేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఆర్ఎం శ్రీదేవి తెలిపారు. బీహెచ్ఈఎల్ డిపో పరిధిలోని దూర ప్రాంతాల బస్సుల్ లో టికెట్లపై రాయితీ కల్పిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ నిర్ణయంతో హైదరాబాద్ నుంచి విజయవాడ, గుంటూరు, మైసూరు, బెంగళూరు మార్గాల్ లో ప్రయాణించే ప్రయాణికులకు భారీగా లబ్ధి చేకూరనుందని, ఈ రాయితీలు బీహెచ్ఈఎల్ నుంచి బయలుదేరే బస్సులకు మాత్రమే వర్తిస్తాయని అధికారులు స్పష్టం చేశారు.