'పీఎఫ్ వేతన పరిమితి పెంపు': కేంద్ర కేబినెట్ చారిత్రక నిర్ణయం
రిపోర్టర్: హరి
స్థలం: న్యూఢిల్లీ
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ వేతన పరిమితిని రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచుతూ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. 2014 తర్వాత ఈపీఎఫ్ఓ సీలింగ్ పెంచడం ఇదే తొలిసారి కాగా, ఈ నిర్ణయం ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 51 లక్షల మంది ఉద్యోగులకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరనుంది. ఈ పెంపుదల కోసం కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రూ.11,339 కోట్ల అదనపు ఆర్థిక భారాన్ని భరించనుండగా, దీనివల్ల ఉద్యోగులకు మెరుగైన సామాజిక భద్రత, రిటైర్మెంట్ సేవింగ్స్ మరియు పెన్షన్ లాభాలు అందనున్నాయి.