విజయవాడ ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డుపై భారీ కొండచరియలు విరిగిపడ్డాయి

రిపోర్టర్: సునీల్ స్థలం: విజయవాడ

విజయవాడ ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డుపై గురువారం రాత్రి భారీ కొండచరియలు విరిగిపడ్డాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ముందస్తు మరమ్మతుల కోసం ఘాట్ రోడ్డును ముందుగానే మూసివేయడంతో పెను ప్రమాదం తప్పిందని ఆయన పేర్కొన్నారు. భారీ వర్షాల కారణంగా బండరాళ్లు జారిపడ్డాయని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. సంఘటన స్థలాన్ని కలెక్టర్, దేవస్థాన ఈవో పరిశీలించి తక్షణ సహాయక చర్యలు చేపట్టారు.