షారుఖ్ ఖాన్ తో అనుబంధంపై అనిల్ కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు

రిపోర్టర్: శివ స్థలం: Mumbai

బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్తో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని, జ్ఞాపకాలను ప్రముఖ నటుడు అనిల్ కపూర్ పంచుకున్నారు. ఆయన అరంగేట్రానికి ముందే తాను షారుఖ్ను కలిశానని, ఆయన కళ్లలో గొప్ప స్టార్ అయ్యే లక్షణాలు కనిపించాయని అనిల్ కపూర్ వెల్లడించారు. తాము తొలినాళ్లలో ఎలా కలుసుకునేవారమో, మన్నత్ భవనం కొనుగోలుకు సంబంధించిన విషయాలను రియాల్టీ షోలో ఆయన గుర్తుచేసుకున్నారు.