స్మార్ట్ఫోన్ మార్కెట్లోకి రీఎంట్రీ: కార్బన్ రెబెల్ సిరీస్ లాంచ్
రిపోర్టర్: శివ
స్థలం: New Delhi
భారతీయ మార్కెట్లోకి కార్బన్ రెబెల్ సిరీస్ స్మార్ట్ఫోన్లు త్వరలో విడుదల కానున్నాయని కార్బన్ సంస్థ తెలిపింది. రెబెల్ ప్రో మరియు రెబెల్ పేరుతో రెండు మోడళ్లు రానుండగా, అమెజాన్ ద్వారా ఇవి అందుబాటులోకి రానున్నాయని కంపెనీ వెల్లడించింది. ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్తో పాటు ఎలాంటి బ్లోట్వేర్ లేకుండా ఈ ఫోన్లు వస్తాయని, భారీ బ్యాటరీ సామర్థ్యాలు కలిగి ఉంటాయని కంపెనీ ప్రతినిధులు స్పష్టం చేశారు.