విజయనగరం ప్రైవేట్ ల్యాబుల్లో రక్త పరీక్షల పేరుతో రోగుల దోపిడీ
రిపోర్టర్: విజయ్
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లా కేంద్రంలోని ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు మరియు క్లినిక్లలో వైద్య పరీక్షల పేరుతో రోగులను విపరీతంగా దోచుకుంటున్నారు. రూ.వందల ఖర్చయ్యే పరీక్షలకు రూ.వేలల్లో వసూలు చేస్తుండగా, వైద్యులకు భారీగా కమీషన్లు ముట్టజెపుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులలో థైరాయిడ్ పరీక్షలు నిలిచిపోవడంతో రోగులు ప్రైవేటు ల్యాబ్లను ఆశ్రయించి నిలువునా మోసపోతున్నారు.