సముద్రపు నాచు సాగుతో రైతన్నలకు భారీగా లాభాలు
రిపోర్టర్: వెంకట్
స్థలం: విజయవాడ
సముద్రపు నాచు పెంపకంతో మత్స్యకారులు మరియు రైతులు భారీగా లాభాలు పొందవచ్చని విశాఖపట్నంలోని సీఎంఎఫ్ఆర్ఐ టెక్నికల్ ఆఫీసర్ రవికుమార్ అవధానులు తెలిపారు. విజయవాడలో జరిగిన ష్రింప్ రిటైల్ వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడుతూ, ఈ సాగుకు భూమి, మంచినీరు, ఖరీదైన ఎరువులు అవసరం లేదని పేర్కొన్నారు. కేజ్ కల్చర్ విధానంలో చేపల పెంపకంతో పాటు నాచు పెంచడం వల్ల రాబడి పెరుగుతుందని వివరించారు. కిలో నాచు సుమారు రెండు వందల యాభై రూపాయలకు పైగా పలుకుతుందని, ఎండబెట్టి అమ్మితే మూడింతల ఆదాయం వస్తుందని ఆయన వెల్లడించారు.