లైంగిక దాడి కేసు నిందితుడి అరెస్ట్: యూఏఈ నుండి భారత్ కు రప్పించిన సీబీఐ

రిపోర్టర్: హరి స్థలం: New Delhi

ఢిల్లీలో జరిగిన యువతి లైంగిక దాడి కేసులో మోస్ట్ వాంటెడ్ నిందితుడైన సజీర్ పల్లి మూప్పమ్ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుండి భారత్ కు రప్పించినట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు. ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయడంతో నిందితుడిని యూఏఈ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విదేశీ భద్రతా సంస్థల సమన్వయంతో చట్టపరమైన లాంఛనాలు పూర్తి చేసి ప్రత్యేక బృందం ద్వారా దేశానికి తీసుకువచ్చి తదుపరి విచారణ కొనసాగిస్తున్నట్లు సీబీఐ స్పష్టం చేసింది.