అమెరికాలో నల్లగొండ విద్యార్థిని అదృశ్యం: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆందోళన

రిపోర్టర్: రమేష్ స్థలం: నల్లగొండ

అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీలో చదువుతున్న నల్లగొండ విద్యార్థిని కోయ శ్రీజా రెడ్డి అదృశ్యంపై రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీజ ఆచూకీని వీలైనంత త్వరగా గుర్తించాలని కోరుతూ ఆయన కేంద్ర విదేశాంగ శాఖతో పాటు బోస్టన్ లోని కాన్సులేట్ జనరల్ కు ఈమెయిల్స్ ద్వారా విజ్ఞప్తి చేశారు. గాలింపు చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి కార్యాలయం వెల్లడించింది.