పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్: ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు

రిపోర్టర్: సునీల్ స్థలం: అమరావతి

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో అమరావతి నిర్మాణ పనులతో పాటు భారీ పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి నూట ఎనిమిది అజెండా అంశాలకు ఆమోదం తెలిపినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. పరిశ్రమల అభివృద్ధికి ప్రత్యేక రాయితీలు, విద్యుత్ మరియు మౌలిక సదుపాయాల పనులకు పచ్చజెండా ఊపినట్లు అధికారులు స్పష్టం చేశారు.