వెలిగొండ ప్రాజెక్టు వద్దకు పోటెత్తిన పర్యాటకులు, కృష్ణమ్మకు పూజలు

రిపోర్టర్: అశోక్ స్థలం: ప్రకాశం

ప్రకాశం జిల్లాలోని పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. కరవు సీమలో కృష్ణమ్మ పరుగులు పెడుతుండటంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జంట సొరంగాల నుంచి వస్తున్న కృష్ణ జలాలను తిలకిస్తూ ప్రత్యేక పూజలు, జలహారతి నిర్వహిస్తున్నారు. దశాబ్దాల కల సాకారమవడంతో స్థానికులు, రైతులు ఉత్సాహంగా ప్రాజెక్టును సందర్శిస్తున్నారు.