'నో ట్రైలర్ కల్చర్': టాలీవుడ్‌లో కొత్త ప్రమోషన్ ట్రెండ్
రిపోర్టర్: కృష్ణ
స్థలం: హైదరాబాద్
టాలీవుడ్‌లో సినిమాల ప్రమోషన్ విషయంలో కొత్త ట్రెండ్ మొదలవుతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. సినిమా రిలీజ్‌కు ముందు ట్రైలర్‌తో హైప్ క్రియేట్ చేసే పద్ధతికి భిన్నంగా, ట్రైలర్ లేకుండానే నేరుగా థియేటర్లలో ప్రేక్షకులకు సర్‌ప్రైజ్ ఇవ్వాలనే ఆలోచనలో కొందరు మేకర్స్ ఉన్నారు. నాని నటిస్తున్న ప్యారడైజ్ చిత్రంతో పాటు రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి సినిమాకు కూడా ట్రైలర్ ఉండకపోవచ్చనే ప్రచారం జరుగుతుండటంతో ఈ నో ట్రైలర్ కల్చర్ హాట్ టాపిక్‌గా మారింది.