విద్యార్థి ఉద్యమాలకు నూతన ఊపిరులూదుతూ రేవూరు నితీష్ బాధ్యతలు

రిపోర్టర్: sujith reddy స్థలం: నెల్లూరు అర్బన్

నెల్లూరు జిల్లా ఏపీ స్టూడెంట్స్ జేఏసీ నూతన జిల్లా ప్రధాన కార్యదర్శిగా, వెంకటగిరి నియోజకవర్గ ఇన్చార్జ్గా రేవూరు నితీష్ కుమార్ అధికారికంగా నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం నెల్లూరులో ఏపీ స్టూడెంట్స్ జేఏసీ జిల్లా అధ్యక్షుడు కూరపాటి గోపాల్ ఒక అధికారిక ప్రకటనను విడుదల చేశారు. నేటి నుంచి జిల్లా వ్యాప్తంగా విద్యార్థి వర్గాల సంక్షేమానికి, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి రేవూరు నితీష్ కుమార్ బాధ్యతలతో ముందుకు సాగుతారని గోపాల్ స్పష్టం చేశారు. ఈ బాధ్యతలతో వెంకటగిరి పరిధిలో విద్యార్థి పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని నూతన కమిటీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.