పలాస మున్సిపల్ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా నామినేషన్ దాఖలు చేసిన రమ్య
రిపోర్టర్: Dinesh Panda
స్థలం: పలాస
శ్రీకాకుళం జిల్లా పలాస పురపాలక ఎన్నికల్లో మన్యాల రమ్య ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక పట్టణాభివృద్ధి, మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా ఆమె ప్రచారం నిర్వహిస్తున్నారు. రమ్యను గెలిపించి పలాస అభివృద్ధిని సాధించుకోవాలని నాయకులు ఓటర్లను కోరుతున్నారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా స్థానిక ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని, ప్రజలు తమకు అండగా నిలుస్తారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.