ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్‌పై చర్యలు తీసుకోవాలని బేగం బజార్ పోలీస్ స్టేషన్లో ఎంపీ మల్లు రవి ఫిర్యాదు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: హైదరాబాద్
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నాగర్‌కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి బేగం బజార్ సెంట్రల్ జోన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఎంను వ్యక్తిగతంగా అవమానించేలా ఉన్న ఈ వ్యాఖ్యలపై రాజ్యాంగబద్ధ పదవుల గౌరవాన్ని దృష్టిలో ఉంచుకుని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎలుగొండ మధుసూదన్ రెడ్డి, గుర్రం కేశవులు తదితరులు పాల్గొన్నారు.