సింగరేణి కార్మికులకు తీపి కబురు: దసరా బోనస్‌గా భారీ మొత్తం జమ
రిపోర్టర్: విజయ్
స్థలం: తెలంగాణ
సింగరేణి కార్మికులకు దసరా పండుగ సందర్భంగా భారీ బోనస్ అందిస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. ప్రజాభవన్ వేదికగా మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. సంస్థ సాధించిన లాభాల్లో ముప్పై నాలుగు శాతం వాటాను కార్మికులకు కేటాయించామని తెలిపారు. దీని ద్వారా ఒక్కో శాశ్వత కార్మికుడికి లక్షా యాభై వేలకు పైగా, కాంట్రాక్టు కార్మికులకు ఐదు వేలకు పైగా బోనస్ అందనుందని స్పష్టం చేశారు.