మేడ్చల్లో దారుణం: డబ్బుల కోసం స్నేహితుడిని పొట్టనబెట్టుకున్న నయవంచకుడు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Medchal
మేడ్చల్ జిల్లాలో డబ్బుల కోసం స్నేహితుడినే అత్యంత క్రూరంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. బంగారం వ్యాపారి నేమారాం చౌదరిని పూజల పేరుతో నమ్మించి యాడారం చెరువు వద్దకు తీసుకెళ్లి హతమార్చినట్లు పోలీసులు వెల్లడించారు. కుమార్తె వివాహం కోసం తెచ్చిన ఇరవై ఐదు లక్షల నగదును కాజేసేందుకే స్నేహితుడు ఖాస్మీ మరో వ్యక్తితో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసుల దర్యాప్తులో స్పష్టమైందని అధికారులు తెలిపారు.