మున్సిపల్ సిబ్బందికి టీ-షర్టులను పంపిణీ చేసిన చైర్మన్ సారంగపాణి
రిపోర్టర్: BHANUCHANDER DOMMATI
స్థలం: వర్ధన్నపేట
వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో వినాయక నిమజ్జన సందర్భంగా విధులు నిర్వర్తిస్తున్న మున్సిపల్ ఉద్యోగులు మరియు స్విమర్లకు మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి టీ-షర్ట్‌లను పంపిణీ చేశారు. కోనారెడ్డి చెరువు వద్ద పారిశుద్ధ్య నిర్వహణ, భక్తులకు అవసరమైన సౌకర్యాల కల్పనలో సిబ్బంది నిరంతరం సేవలందిస్తున్నారని ఆయన కొనియాడారు. నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా అధికారులు, పారిశుద్ధ్య కార్మికులు సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ పిలుపునిచ్చారు.