ప్రజావాణి దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ కుమార్ దీపక్ వార్నింగ్

రిపోర్టర్: R.RAVINDER స్థలం: మంచిర్యాల

మంచిర్యాల కలెక్టరేట్ లో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అర్జీదారుల నుండి వినతులను స్వీకరించారు. అందిన ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి త్వరగా పరిష్కరించేలా సంబంధిత శాఖల అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రయ్య, రాములు, రెవెన్యూ అధికారి మోతిరామ్ పాల్గొన్నారు.